Sanju Samson: సంజూ శాంసన్ చెత్త రికార్డు.. విరాట్, రోహిత్‌లను దాటేశాడు

Sanju Samson is the most duck out batter in a calendar year in the t20 format
  • టీ20 ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ప్లేయర్‌గా నిలిచిన సంజూ
  • దక్షిణాఫ్రికాపై రెండో టీ20లో ఔట్‌తో కలుపుకొని ఈ ఏడాది నాలుగు సార్లు డకౌట్
  • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కంటే ఎక్కువ సార్లు సున్నా పరుగులకే సంజూ ఔట్ 
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో సెంచరీ సాధించి టీ20 ఫార్మాట్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన ఏకైక భారతీయ క్రికెటర్‌గా సంజూ శాంసన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. సఫారీలతో టీ20 సిరీస్‌కు ముందు హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌‌పై శతకం బాదడంతో ఈ రికార్డు అతడి సొంతమైంది. అయితే నిన్న రాత్రి (ఆదివారం) దక్షిణాఫ్రికాపై రెండవ టీ20లో కూడా సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర లిఖిస్తాడేమో అని ఆశిస్తే తీవ్రంగా నిరాశపరిచాడు. మూడు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. యన్‌సెన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

దీంతో సంజూ శాంసన్ ఖాతాలో ఒక అవాంఛిత రికార్డు చేరింది. టీ20 ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ప్లేయర్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. దక్షిణాఫ్రికాపై రెండవ టీ20లో డకౌట్‌తో కలుపుకొని ఈ ఏడాది మొత్తం 4 సార్లు సున్నా పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ విషయంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కూడా సంజూ మించిపోయాడు. వీరిద్దరి కంటే ఎక్కువసార్లు డకౌట్లు అయ్యాడు.

కాగా గెబెర్హా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండవ టీ20లో మొదటి ఓవర్‌లో సంజూ శాంసన్ ఔట్ అయ్యాడు. మార్కో యన్‌సెన్ వేసిన ఓవర్‌ మూడవ బంతికి స్టంప్స్ వదిలేసి ఆడాడు. లెంగ్త్ బాల్ దూసుకెళ్లి వికెట్లకు తగిలింది.
Sanju Samson
Team India
Cricket
Sports News

More Telugu News