KTR: ఆ ముగ్గురు పిల్లలను నా పిల్లల మాదిరే చదివిస్తా: కేటీఆర్

KTR assures three children of weaver couple who committed suicide
  • సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతులు
  • ముగ్గురు పిల్లల పరిస్థితి పట్ల చలించిపోయిన కేటీఆర్
  • రూ.2 లక్షల చొప్పున ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తానని హామీ
  • వారికి పూర్తిగా అండగా నిలుస్తానని వెల్లడి 
సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతుల కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు పరామర్శించారు. ఈ దంపతుల ముగ్గురు పిల్లల పరిస్థితి పట్ల కేటీఆర్ చలించిపోయారు. ఆ ముగ్గురు పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు తన పిల్లల మాదిరిగానే చదివిస్తానని హామీ ఇచ్చారు. 

అంతేకాదు, ఆ పిల్లల పేరిట రూ.2 లక్షల చొప్పున ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ధ్వజమెత్తారు. బతుకమ్మ చీరల కాంట్రాక్టు రద్దు చేయడం వల్లే సిరిసిల్ల ప్రాంతంలో నేతన్నల ఆత్మహత్యలు పెరిగాయని వ్యాఖ్యానించారు. 

సిగ్గు, లజ్జ ఉంటే చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
KTR
Weaver Couple
Suicide
Children
Sircilla
BRS
Telangana

More Telugu News