Aha: బాలకృష్ణ - అల్లు అర్జున్‌ల ఆహా అన్‌స్టాపబుల్ ప్రోమో విడుదల

Balakrishna Allu Arjuns Aha Unstoppable Promo Released

  • ప్రోమో విడుదల చేసిన 'ఆహా' సంస్థ 
  • రెండు భాగాలుగా ప్రసారం కానున్న ఎపిసోడ్‌ 
  • ఈ నెల 15న తొలిభాగం స్ట్రీమింగ్‌

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ వేదికగా రూపొందుతోన్న 'అన్‌స్టాపబుల్‌' గురించి అందరికి తెలిసిందే. ఈ 'అన్‌స్టాపబుల్‌'తో బాలకృష్ణ సరికొత్త అభిమానులను సంపాందించుకున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో ఆయన ఎనర్జీ, స్పాంటేనియస్‌గా పంచ్‌లు పేల్చడం అందర్ని ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు మూడు సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ 'ఆహా- కార్యక్రమం ప్రస్తుతం నాలుగో సీజన్‌ను ఇటీవలే ప్రారంభించింది. 

గత నెలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బాలకృష్ణ చేసిన ఎపిసోడ్‌ అందరిని అలరించింది. ఈ సీజన్‌లో భాగంగా ఇటీవల అల్లు అర్జున్‌తో ఓ ఎపిసోడ్‌ను షూట్‌ చేశారు. రెండు భాగాలుగా ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన మొదటి భాగం ఈ నెల 15న 'ఆహా'లో స్ట్రీమింగ్‌ కానుంది. అయితే దీనికి సంబంధించిన ప్రోమోను ఆదివారం విడుదల చేశారు. 

ఇందులో అల్లు అర్జున్‌ను, బాలకృష్ణ ' మై డియర్‌, ఫ్రెండ్‌ అండ్‌ బ్రదర్స్‌' అని సంభోందించడం, 'మీ మ్యాన్షన్‌లో హౌస్‌ పార్టీ చేసుకుందామని' బన్నీచెప్పడం, 'జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటుల లిస్టులో మన తెలుగు వారి పేరు లేకపోవడంతో.. అది రౌండప్‌ చేసుకుని ఇది కొట్టాలి' అనుకున్నానని అల్లు అర్జున్‌ తెలియజేయడం, చిన్నప్పుడు 'అమ్మ నన్ను అన్ని వెపన్‌లతో కొట్టేదని, స్నేహారెడ్డి అనే వెపన్‌ వల్ల నేను మారానని' చెప్పడం, తనకు 'రొమాన్స్‌ అంటే ఇష్టమని' అనడం ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్‌ విషయాలతో పాటు ఎంతో ఫన్నీగా, ఎనర్జీగా ఈ ఎపిసోడ్‌ వుండబోతుందని ఈ ప్రోమో చూస్తే తెలుస్తుంది. చిరంజీవి, మహేష్‌బాబులతో తన అనుబంధం గురించి బన్నీ (అల్లు అర్జున్‌) పంచుకోవడం కూడా ఇందులో చూడొచ్చు. ఇక అల్లు అర్జున్‌ తల్లి నిర్మల కూడా ఈ ఎపిసోడ్‌లో గెస్ట్‌గా కనిపించారు. 

చివర్లో మీరు పుష్ప-3 చేయండి, నేను అఖండ-2 చేస్తాను అని అల్లు అర్జున్‌ చెప్పడంతో ఈ ప్రోమో ముగిసింది. టోటల్‌గా ఈ ప్రోమో అందరిలో ఆసక్తిని పెంచింది. 




Aha
Unstoppable
Unstoppable season 4
Balakrishna
Allu Arjun
Pushpa2
Cinema
Akhanda2
  • Loading...

More Telugu News