4B Movement: ట్రంప్ గెలుపునకు నిరసనగా అమెరికా మహిళల ‘4బీ ఉద్యమం’.. ఇంతకీ ఏంటది?

No sex no marriage no dating no kids US women 4B movement
  • సౌత్ కొరియా ‘4బీ’ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకున్న యూఎస్ మహిళలు
  • ట్రంప్‌కు ఓటేసిన పురుషులు తమ హక్కులను కాలరాశారని ఆగ్రహం
  • వచ్చే నాలుగేళ్లు శృంగారం, వివాహం, డేటింగ్, పిల్లల్ని కనడానికి దూరంగా ఉంటామని ప్రతిన
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న మహిళలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నాలుగేళ్లపాటు శృంగారం, పిల్లల్ని కనడానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దక్షిణ కొరియా ‘4బీ మూవ్‌మెంట్‌’తో స్ఫూర్తి పొందిన అమెరికా మహిళలు డేటింగ్, శృంగారం, వివాహం, పిల్లల్ని కనడానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. 

వచ్చే నాలుగేళ్లు తాను శృంగారానికి దూరంగా ఉంటానని ఓ మహిళ పేర్కొంది. పురుషులందరూ ఓటింగ్ ద్వారా తమ హక్కులను కాలరాశారని, కాబట్టి వచ్చే నాలుగేళ్లు తమను తాకే అర్హతను కోల్పోయారని మరో మహిళ పేర్కొన్నారు. ఒక మహిళగా తనకు శారీరక స్వయంప్రతిపత్తి ముఖ్యమని, దానిపై సార్వభౌమాధికారాన్ని అమలు చేయడానికి ఇదే మార్గమని టిక్‌టాక్ యూజర్ ఒకరు తెలిపారు. ‘4బీ ఉద్యమం’లో పాల్గొనేందుకు అమెరికా మహిళలకు ఇదే మంచి సమయమని మరో మహిళ వివరించారు. డేటింగ్ యాప్‌లను డిలీట్ చేయాలని కోరారు.

ఇంతకీ ఏంటీ ‘4బీ ఉద్యమం’?
ఈ ‘4బీ ఉద్యమం’ దక్షిణ కొరియాలో మొదలైంది. కొరియన్ భాషలో ‘బి’ అనేది ‘నో’ అనే దానికి పొట్టిపేరు. 4బీ అంటే నాలుగు ‘నో’లు అన్నమాట. ఆ నాలుగు.. శృంగారం (బిసెక్స్యూ), డేటింగ్(బయోనే), వివాహం (బిహాన్), పురుషులతో పిల్లల్ని కనడం (బిచుల్సాన్). ఈ నాలుగింటికీ దూరంగా ఉండడమే ‘4బీ ఉద్యమం’ హిడెన్ కెమెరాలు, సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది.
4B Movement
US Women
South Korea
Dating
Marriage
Abortion

More Telugu News