Train Accident: బెంగాల్‌లో పట్టాలు తప్పిన సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్

3 Coaches Of Secunderabad Shalimar Superfast Express deraile
  • పట్టాలు తప్పిన వీక్లీ స్పెషల్ రైలులోని మూడు కోచ్‌లు
  • ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని వెల్లడించిన అధికారులు
  • రైల్వే మధ్య ట్రాక్ నుంచి వెలుపలి ట్రాక్‌కు మారుతుండగా ఘటన
పశ్చిమ బెంగాల్‌లోని సల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్-షాలిమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ వీక్లీ స్పెషల్ రైలులోని మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సౌత్-ఈస్ట్రన్ రైల్వే సీపీఆర్వో వెల్లడించారు.

సల్పూర్ రైల్వే స్టేషన్ కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు మిడిల్ ట్రాక్ నుంచి వెలుపలి ట్రాక్‌కు మారుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన మూడు బోగీల్లో రెండు ప్రయాణికులవి కాగా, ఒకటి పార్సిన్ వ్యాన్ ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. పట్టాలు తప్పిన విషయం తెలియగానే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులను బస్సుల్లో కోల్‌కతాకు తరలిస్తున్నారు.
Train Accident
Indian Railways
Hyderabad
West Bengal

More Telugu News