Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. విలేజ్ డిఫెన్స్ గార్డులను కిడ్నాప్ చేసి హత్య

Terrorists Kidnap and Kill 2 Village Defence Guards In Kishtwar
  • నిన్న కిష్త్‌వర్ జిల్లాలో విలేజ్ గార్డుల కిడ్నాప్
  • ఆ వెంటనే కాల్చి చంపిన వైనం
  • వారిని చంపింది తామేనని ప్రకటించిన ‘కశ్మీర్ టైగర్స్’
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. కిష్త్‌వర్‌ జిల్లాలో ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు అనంతరం వారిని కాల్చి చంపారు. అధ్వారీలోని ముంజ్లా ధర్ అడవీ ప్రాంతంలో నజీర్ అహ్మద్, కుల్దీప్ కుమార్‌ను నిన్న కిడ్నాప్ చేసిన ముష్కరులు వారిని కాల్చి చంపారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. శ్రీనగర్‌ సండే మార్కెట్‌లో ఆదివారం గ్రనేడ్ దాడిలో 12 మంది గాయపడిన తర్వాత, తాజాగా ఈ ఘటన జరిగింది. 

విలేజ్ డిఫెన్స్ గార్డులను కిడ్నాప్ చేసి, హత్య చేసింది తామేనని జైషే-ఈ-మహమ్మద్ అనుబంధ సంస్థ కశ్మీర్ టైగర్స్ ప్రకటించింది. కళ్లకు గంతలతో ఉన్న మృతదేహాల ఫొటోలను విడుదల చేసింది. ఈ ఘాతుకాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు.   
Jammu And Kashmir
Adhwari
Village Defence Gaurds
Kashmir Tigers

More Telugu News