Jammu And Kashmir: వరుసగా రెండోరోజూ రణరంగంగా మారిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ

Chaos in Jammu and Kashmir Assembly for 2nd day over Article 370

  • ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ నిన్న తీర్మానం
  • నేడు బ్యానర్ ప్రదర్శించిన పీడీపీ ఎమ్మెల్యే
  • ప్రతిగా ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో హోరెత్తించిన బీజేపీ ఎమ్మెల్యేలు
  • మార్షల్స్‌తో బయటకు పంపించిన స్పీకర్

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానంపై నిరసనల పర్వం కొనసాగుతోంది. నిన్న ముష్టి ఘాతాలు కురిపించుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీని రణరంగంగా మార్చారు. నేడు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కూడా ఇదే కొనసాగింది. 

ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) కుప్వారా ఎమ్మెల్యే బ్యానర్ ప్రదర్శించడం ఘర్షణకు కారణమైంది. ఆ బ్యానర్ చూసిన వెంటనే ‘భారత్ మాతా కీ’ అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను ఆర్డర్‌లో పెట్టే క్రమంలో స్పీకర్ అబ్దుల్ రహీమ్ మార్షల్స్‌ను పిలిచి వెల్‌ లోకి దూకిన బీజేపీ ఎమ్మెల్యేను బయటకు పంపారు.  

Jammu And Kashmir
Article 370
BJP
PDP
  • Loading...

More Telugu News