ss rajamouli: తన పాన్ ఇండియా చిత్రాలకు స్ఫూర్తి ఎవరో చెప్పిన రాజమౌళి

ss rajamouli says suriya is his inspiration for pan india at kanguva pre release event
  • హీరో సూర్యనే తన పాన్ ఇండియా మూవీలకు ఇన్స్‌పిరేషన్ అన్న రాజమౌళి
  • కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్యపై రాజమౌళి ప్రశంసలు
  • తెలుగు ప్రేక్షకులకు సూర్య ఎలా దగ్గర కాగలిగాడు అనే దాన్ని కేస్ స్టడీగా తీసుకోమని మన హీరోలు, నిర్మాతలకు చెప్పానన్న రాజమౌళి
తన పాన్ ఇండియా చిత్రాలకు హీరో సూర్య స్పూర్తి అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపారు. సూర్య హీరోగా దర్శకుడు శివ రూపొందించిన కంగువ సినిమా ఈ నెల 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న రాజమౌళి.. సూర్య నటనను ప్రశంసించారు. 

తెలుగు సినిమాని తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా ప్రపంచానికి చూపించే విషయంలో సూర్యనే తనకు స్పూర్తి అని రాజమౌళి చెప్పారు. గజిని మూవీ విడుదల సమయంలో ఆయన చేసిన ప్రచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. సూర్య తెలుగు ప్రేక్షకులకు ఎలా దగ్గర కాగలిగాడు అనే దాన్ని కేస్ స్టడీగా తీసుకోమని మన హీరోలు, నిర్మాతలకు చెప్పేవాడినని అన్నారు. 

అలా నా పాన్ ఇండియా మూవీ బాహుబలికి సూర్యనే స్పూర్తి అని తెలిపారు. సూర్య నటన అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. కంగువ టీమ్ ఎంత కష్టపడిందో మేకింగ్ వీడియో చూస్తే అర్ధమవుతోందన్నారు. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందని రాజమౌళి పేర్కొన్నారు. 
ss rajamouli
Hero suriya
Movie News
Kanguva

More Telugu News