Chandrababu: తాళ్లాయపాలెంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu inaugurates Eelectric Sub Station in Tallayapalem
  • రూ.505 కోట్ల వ్యయంతో విద్యుత్ సబ్ స్టేషన్
  • 400/220 కేవీ సామర్థ్యంతో సబ్ స్టేషన్ నిర్మాణం
  • ఇక్కడ్నించే మరో ఐదు సబ్ స్టేషన్లను కూడా ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నేడు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఇది 400/220 కేవీ సబ్ స్టేషన్. దీన్ని రూ.505 కోట్ల వ్యయంతో నిర్మించారు. 

నేడు తాళ్లాయపాలెం విచ్చేసిన సీఎం చంద్రబాబు... ఈ సరికొత్త సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఇక్కడ్నించే మరో ఐదు సబ్ స్టేషన్లను కూడా చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. ఈ ఐదు సబ్ స్టేషన్లను రూ.702 కోట్లతో నిర్మించారు. 

ఇక, రూ.4,665 కోట్లతో చేపట్టనున్న 14 ట్రాన్స్ కో పనులకు కూడా చంద్రబాబు నేడు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొన్నారు.
Chandrababu
Eelectric Sub Station
Tallayapalem
TDP-JanaSena-BJP Alliance

More Telugu News