Jet Airways: సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు.. ముగిసిన జెట్‌ ఎయిర్‌వేస్ క‌థ‌!

Supreme Court On Jet Airways Liquidation
  • జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆస్తుల విక్రయానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
  • సంస్థ ఉద్యోగులు, రుణ దాతల ప్రయోజనం కోసం ఈ నిర్ణయమ‌న్న న్యాయ‌స్థానం
  • ఆస్తుల విక్రయానికి లిక్విడేటర్‌ను నియమించాలని ఎన్‌సీఎల్‌టీ ముంబయి బెంచ్‌కు ఆదేశాలు
ఆర్థికంగా దివాలా తీసిన ప్ర‌ముఖ‌ విమానయాన సంస్ఖ జెట్‌ ఎయిర్‌వేస్‌కు సంబంధించి సుప్రీంకోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంస్థ‌ ఆస్తుల విక్రయానికి (లిక్విడేషన్‌) దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ కథ ముగిసినట్లైంది.

కాగా, సంస్థ ఉద్యోగులు, రుణ దాతల ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఆస్తుల విక్రయానికి లిక్విడేటర్‌ను నియమించాలని ఎన్‌సీఎల్‌టీ ముంబయి బెంచ్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 


Jet Airways
Supreme Court
Liquidation

More Telugu News