కోహ్లీకి ఊహించని వ్యక్తి నుంచి బర్త్ డే విషెస్
- విరాట్ కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఇటలీకి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారిణి అగాటా ఇసాబెల్లా సెంటాస్సో
- అగాటా తెలిపిన బర్త్ డే విషెస్‌పై నెటిజన్ల విమర్శలు
- తప్పుగా ఎందుకు కామెంట్స్ చేస్తున్నారంటూ ప్రశ్నించిన అగాటా
ఇటలీలోని ఓ అభిమాని నుంచి మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఆల్ ది బెస్ట్ అంటూ ఫుట్‌బాల్ క్రీడాకారిణి అగాటా ఇసాబెల్లా సెంటాస్సో సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఆమెపై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలపై ఆమె స్పందించింది. తాను క్రికెట్ లేదా విరాట్ కోహ్లీ గురించి పోస్టు పెట్టిన ప్రతిసారీ ఇలానే జరుగుతోందని, తప్పుగా ఎందుకు కామెంట్స్ చేస్తున్నారని ప్రశ్నించింది. నిజాయితీగా చెబుతున్నా ఎందుకు అలా అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు పేర్కొంది.