Telangana: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana inter board fees details
  • నవంబర్ 6 నుంచి 26 వరకు ఫీజులు చెల్లించేందుకు అవకాశం
  • 27 నుంచి డిసెంబర్ 4 వరకు ఫైన్‌తో చెల్లించే వెసులుబాటు
  • రూ.1000 ఫైన్ ఉంటుందని తెలిపిన ఇంటర్ బోర్డు
ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ఇంటర్ బోర్డు ఈరోజు ప్రకటించింది. నవంబర్ 6వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత రూ.1,000 ఫైన్‌తో నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 4 వరకు చెల్లించవచ్చు.

ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు రూ.520, ఒకేషనల్ విద్యార్థులు రూ.750 చెల్లించాలని బోర్డు తెలిపింది. సెకండ్ ఇయర్ జనరల్ ఆర్ట్స్ విద్యార్థులు రూ.520, సెకండ్ ఇయర్ జనరల్ సైన్స్ విద్యార్థులు రూ.750 చెల్లించాలని ఇంటర్ బోర్డు తెలిపింది.
Telangana

More Telugu News