'డెడికేటెడ్ కమిటీ' చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ వెంకటేశ్వరరావును నియమించిన తెలంగాణ ప్రభుత్వం
- ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- రిజర్వేషన్లపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఆదేశాలు
ఎల్లుండి నుంచి తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల ప్రాతిపదికన సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా... న్యాయపరమైన చిక్కులు లేకుండా కోర్టు తీర్పులను అనుసరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
కులగణన, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో ఇటీవల హైకోర్టు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం సమీక్షించింది. ఈ క్రమంలో డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.