Canada: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి... భారత్ తీవ్ర ఆందోళన

India on Hindu temple attack in Canada
  • కెనడాలో దాడిని ఖండిస్తున్నామన్న భారత్
  • ఇలాంటి దాడుల నుంచి కాపాడాలని విజ్ఞప్తి
  • ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ప్రకటన
కెనడాలోని భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంలో భక్తులపై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడులు చేశారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కెనడాలో హిందూ దేవాలయాన్ని, భక్తులను లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడిని ఖండిస్తున్నామని భారత విదేశాంగశాఖ అధికారి ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ అన్నారు.

ఉగ్రవాదులు, వేర్పాటువాదుల హింసాత్మక చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి దాడుల నుంచి దేవాలయాలను కాపాడాలని ఆయన కెనడా ప్రభుత్వాన్ని కోరారు. హింసకు పాల్పడిన వారిని తప్పకుండా శిక్షిస్తామని హెచ్చరించారు. భారతీయులకు కాన్సులర్ సేవలు అందించే దౌత్యవేత్తలు ఈ తరహా బెదిరింపులకు తలొగ్గరని స్పష్టం చేశారు. దేవాలయంపై దాడి ఘటనకు సంబంధించి ఖలిస్థాన్ వేర్పాటువాదులను శిక్షిస్తారని భావిస్తున్నామన్నారు.
Canada
Hindu Temple
India

More Telugu News