Kannada Film Industry: కన్నడ డైరెక్టర్ ఆత్మహత్య

Kannada Director Guru Prasad Suicide

  • బెంగళూరులోని తన నివాసంలో ఉరి
  • కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
  • నటుడిగా, డైలాగ్ రైటర్ గానూ ఆకట్టుకున్న గురు ప్రసాద్

కన్నడ డైరెక్టర్, నటుడు గురు ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులోని తన నివాసంలో ఆయన ఉరి వేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రముఖ డైరెక్టర్ గా, నటుడిగా, డైలాగ్ రైటర్ గా పేరొందిన గురు ప్రసాద్ ఆత్మహత్య వార్తతో కన్నడ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. డెడ్ బాడీని పరిశీలించిన పోలీసులు గురు ప్రసాద్ రెండు, మూడు రోజుల క్రితమే ఉరి వేసుకున్నట్లు భావిస్తున్నారు. గురు ప్రసాద్ ఆత్మహత్యకు కారణమేంటనేది ఇంకా తెలియరాలేదని వివరించారు. 

మఠం, ఎద్దేలు మంజునాథ, రంగనాయక తదితర సినిమాలకు గురు ప్రసాద్ దర్శకత్వం వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును కూడా అందుకున్నారు. బాడీగార్డ్, కుష్క, విజిల్, హుడుగురు, మైలారీ, జిగర్తాండ సినిమాల్లో గురు ప్రసాద్ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక హుడుగారు, విజిల్, సూపర్ రంగా చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా కూడా గురు ప్రసాద్ పనిచేశారు. గురు ప్రసాద్ మరణంపై కన్నడ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Kannada Film Industry
Director
Guru Prasad
Suicide
Bengaluru
  • Loading...

More Telugu News