Chandrababu: రుషికొండ ప్యాలెస్ లోపల చూసి థ్రిల్లయిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

Chandrababu thrilled while seeing Rushikonda Palace inner arrangements
  • విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
  • రుషికొండ భవనాల పరిశీలన
  • సౌకర్యాలు చూసి నమ్మలేకపోయిన చంద్రబాబు
  • కలలో కూడా ఊహించలేదంటూ కామెంట్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ విశాఖలో పర్యటించారు. ఇక్కడి రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన విలాసవంతమైన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ భవనాల్లో ఉన్న లగ్జరీని చూసి చంద్రబాబు అడుగడుగునా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ భవనాల లోపల ఇంతటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయని తాను ఏమాత్రం ఊహించలేదన్నారు. 

50 మంది, 100 మంది, 300 మంది పట్టేలా... ఇలా వివిధ స్థాయిల్లో ఉన్న కాన్ఫరెన్స్ హాళ్లను చూశారు. కారిడార్ లో ఉన్న లైటింగ్ ను చూసి విస్మయానికి గురయ్యారు. రూ.36 లక్షల విలువ చేసే బాత్ టబ్ గురించి గంటా శ్రీనివాసరావు చెబుతుంటే నమ్మలేకపోయారు. 

విశాలమైన ఆఫీస్ చాంబర్లను, సకల సదుపాయాలతో కూడిన బెడ్రూంలను కూడా చంద్రబాబు సందర్శించారు. రుషికొండ ప్యాలెస్ లో పలు చోట్ల ఉన్న డిజైనర్ ఫ్యాన్లు చంద్రబాబు దృష్టిని ఆకర్షించాయి. అధికారులను అడిగి దాని గురించి తెలుసుకున్నారు. ఆ ఫ్యాన్లు వివిధ రకాల ఆకృతుల్లో ఉండడంతో అందరూ నవ్వుకున్నారు. ఖరీదైన స్పా బెడ్ ను కూడా పరిశీలించారు.

ఈ పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ భరత్, టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. కాగా, ఆ భవనాల్లో ఎక్కడ ఏది ఉందో తెలుసుకోవడానికి చంద్రబాబు ఓ మ్యాప్ చూడాల్సి వచ్చింది.
Chandrababu
Rushikonda Palace
Visakhapatnam
TDP-JanaSena-BJP Alliance
YSRCP

More Telugu News