Somy Ali: ‘అండర్ వరల్డ్’ నుంచి సల్మాన్ బెడ్రూంలోని ల్యాండ్‌లైన్‌కు ఫోన్ వచ్చింది.. సంచలన విషయాలు వెల్లడించిన మాజీ గాళ్‌ఫ్రెండ్ సోమీ అలీ

Salman got a threat call from Underworld on his landline Somy Ali remembered

  • 90లలో సల్మాన్‌తో సోమీ అలీ చెట్టపట్టాల్
  • సల్మాన్‌ అపార్ట్‌మెంట్‌లో మూడేళ్లపాటు ఉన్న సోమీ
  • సల్మాన్‌కు వచ్చిన ఫోన్ కాల్ లిఫ్ట్ చేసిన నటి
  • ఆమెను ఎత్తుకుపోతామని, ఈ విషయాన్ని సల్మాన్‌తో చెప్పాలన్న అవతలి వ్యక్తి
  • సల్మాన్ ఈ విషయాన్ని ఎలా డీల్ చేశాడో తనకు తెలియదన్న సోమీ
  • అప్పట్లో అండర్ వరల్డ్ ప్రభావం ఇండస్ట్రీపై ఎక్కువగా ఉండేదని గుర్తు చేసుకున్న నటి

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ మాజీ గాళ్‌ఫ్రెండ్ సోమీ అలీ అండర్ వరల్డ్ గురించి సంచలన విషయాలను వెల్లడించింది. 1990లలో సల్మాన్‌తో చెట్టపట్టాలేసుకుని తిరిగిన ఆమెను ఎత్తుకుపోతామని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి కాల్ వచ్చిందని, ఆ ఫోన్‌ను స్వయంగా తానే లిఫ్ట్ చేశానని గుర్తు చేసుకుంది.

న్యూస్ ఏజెన్సీ ‘ఐఏఎన్ఎస్’తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన సోమీ.. బాలీవుడ్, దావూద్ ఇబ్రహీం, ఇతర విషయాల గురించి మాట్లాడింది. సల్మాన్‌తో రిలేషన్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్‌పై దావూద్ ఇబ్రహీం ప్రభావం ఎలా ఉండేదన్న ప్రశ్నకు ఆమెకు బదులిస్తూ.. దావూద్ గురించి తాను కూడా చాలా విన్నట్టు పేర్కొంది. అయితే, నేరుగా ఎవరూ ఆయన పేరును ప్రస్తావించే వారు కాదని, చోటా షకీల్ గురించి కూడా ఎవరూ మాట్లాడేవారు కాదని తెలిపింది. వారిని అండర్ వరల్డ్ గానే సంబోధించే వారని వివరించింది. 

దివ్యభారతి నా క్లోజ్ ఫ్రెండ్
నటి దివ్య భారతి తనకు క్లోజ్ ఫ్రెండ్ అని, బెంగళూరులో ‘ఆందోళన్’ షూటింగ్ సమయంలో తామిద్దరం ఎంతగానో కలిసిపోయామని గుర్తుచేసుకుంది. ఆ సమయంలో తాను ‘అండర్ వరల్డ్’ అంటే ఏమిటని ఆమెను అడిగానని, దానికి దివ్య ‘మాఫియా అంటే ఏంటో నీకు తెలుసా?’ అని తనను అడిగిందని చెప్పింది. దానికి తాను ‘తెలుసు, అమెరికాలో ఇటాలియన్ మాఫియా ఉండేది’ అని చెప్పానని పేర్కొంది. అప్పుడు దివ్య భారతి.. అండర్ వరల్డ్.. మాఫియా రెండూ ఒకటేనని బదులిచ్చిందని తెలిపింది. 

నన్ను ఎత్తుకు పోతానని.. నాకే ఫోన్
తాను సల్మాన్‌ఖాన్‌తో కలిసి ఆయన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో మూడేళ్లు ఉన్నానని, ఒకసారి తమ బెడ్రూంలోని ల్యాండ్‌లైన్‌కు ఫోన్ వచ్చిందని సోమీ అలీ గుర్తు చేసుకుంది. ఫోన్ చేసిన వ్యక్తి తనను కిడ్నాప్ చేస్తానని బెదిరించాడని పేర్కొంది. ‘సల్మాన్ కో ఫోన్ దేనా, సోమీ అలీ కో హమ్ ఉఠా కర్ లే జాయేంగే (సల్మాన్‌కు చెప్పు, సోమీ అలీని మేం కిడ్నాప్ చేయబోతున్నామని)  అని చెప్పాడని గుర్తు చేసుకుంది.

సల్మాన్ హ్యాండిల్ చేశాడు 
ఫోన్ విషయాన్ని తాను సల్మాన్‌కు చెబితే తాను చూసుకుంటానని చెప్పాడని, అయితే, ఆ విషయాన్ని ఎలా డీల్ చేశాడన్న విషయాన్ని తనకెప్పుడూ చెప్పలేదని సోమీ వివరించింది. ఆ రోజు ఫోన్ చేసింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశారా? అని సోమీని ప్రశ్నించగా, తాను ఈ విషయాన్ని రెండుమూడుసార్లు సల్మాన్ వద్ద ప్రస్తావించానని, కానీ, ఇలాంటి విషయాలు తెలుసుకోకపోవడమే మంచిదని తనకు సలహా ఇచ్చాడని సోమీ వివరించింది.

Somy Ali
Salman Khan
Bollywood
Under World
Dawood Ibrahim
  • Loading...

More Telugu News