Bhanuprakash Reddy: కొత్తగా బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డికి టీటీడీ పాలకమండలిలో చోటు

BJP leader Bhanuprakash Reddy appointed as TTD board member
  • ఇటీవల 24 మందితో టీటీడీ పాలకమండలి నియామకం
  • చైర్మన్ గా బీఆర్ నాయుడు
  • నేడు టీటీడీ పాలకమండలి సభ్యుల పూర్తి జాబితా విడుదల 
ఇటీవలే ఏపీ ప్రభుత్వం 24 మందితో టీటీడీ నూతన పాలకమండలిని ప్రకటించింది. చైర్మన్ గా టీవీ5 అధినేత బీఆర్ నాయుడును నియమించింది. టీటీడీ చైర్మన్, సభ్యుల పూర్తి జాబితాను నేడు విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా టీటీడీ బోర్డులో బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డికి చోటు కల్పించారు. 

తాజాగా, మరో నలుగురిని ఎక్స్ అఫిషియో మెంబర్లుగా నియమించారు. ఎక్స్ అఫిషియో మెంబర్లుగా రెవెన్యూ శాఖ కార్యదర్శి, విజయవాడ పరిధి దేవాదాయ శాఖ కమిషనర్, తుడా చైర్మన్, టీటీడీ ఈవో వ్యవహరిస్తారు.
Bhanuprakash Reddy
Member
TTD
Tirumala
Tirupati
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News