TDP: లోగుట్టు ఆ కుటుంబానికే ఎరుక... టీడీపీ సంచ‌ల‌న ట్వీట్‌!

TDP Sensational Post on YS Vijayamma Car
  • వైఎస్ విజ‌య‌మ్మ వినియోగించిన‌ ల‌గ్జ‌రీ కారుపై 'ఎక్స్' వేదిక‌గా టీడీపీ పోస్టు
  • వైర‌ల్‌గా మారిన ట్వీట్‌
  • నెట్టింట‌ పోస్టుపై స‌ర్వ‌త్రా చ‌ర్చ
తాజాగా టీడీపీ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా చేసిన పోస్టుపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. మాజీ సీఎం, వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ వినియోగించిన‌ ల‌గ్జ‌రీ కారుకు సంబంధించిన ఓ స్టోరీని ఈ పోస్టులో టీడీపీ రాసుకొచ్చింది. 

"రోడ్డు పక్కన దీనంగా పడి ఉన్న ఈ ఖరీదైన కారు ఎవరిదో కాదు...  వందల మందిని తనకు రక్షణగా పెట్టుకుని తిరిగే లక్షల కోట్ల ఆస్తిపరుడు జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఇది. సరికొత్త కారు. అత్యాధునిక సెక్యూరిటీ హంగులు ఉన్న కారు. 

అయినప్పటికీ ఒకేసారి రెండు చక్రాలు ఊడిపోయాయి. ఇంకా నయం ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఇంత హై ఎండ్ కారు, అదీ కొత్త కారుకి ఇలా జరగడం చూసి, ముందు ఆశ్చర్యపోయి, తర్వాత మన సైకో బ్యాక్ గ్రౌండ్ తెలిసి, ఏం జరిగిందో చాలా మంది ఊహించారు. 

ఇదంతా జరిగింది 2024 ఎన్నికల ముందు. 2019 ఎన్నికలకు బాబాయ్ ని లేపేసినట్టే... ఈ ఎన్నికలకు మరో పెద్ద తలకాయను జగన్ టార్గెట్ చేస్తాడేమో అని ఏపీ ప్రజలు అనుకుంటున్న సమయంలో ఇది జరిగింది. తర్వాత ఏడాది పాటు విజయ రాజశేఖర్ రెడ్డి అమెరికాలోనే ఉన్నారు. లోగుట్టు ఆ కుటుంబానికే ఎరుక!" అని త‌న ట్వీట్‌లో పేర్కొంది. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 


TDP
YS Vijayamma
Andhra Pradesh

More Telugu News