Mumbai Indians: ముంబై ఇండియన్స్ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా వచ్చేసింది... రోహిత్ సంగతి ఏంటంటే!

Jasprit Bumrah is the top retention for the Mumbai Indians Retain List
  • నేటితో ముగిసిన ఐపీఎల్ ఆటగాళ్ల రిటెన్షన్ గడువు
  • రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలు విడుదల చేసిన ఫ్రాంచైజీలు
  • రోహిత్ శర్మను అట్టిపెట్టుకున్న ముంబయి... కెప్టెన్ మాత్రం హార్దిక్ పాండ్యానే!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను ఆయా ఫ్రాంచైజీలు నేడు ప్రకటించాయి. 

ముంబై ఇండియన్స్ కూడా తమ రిటెయిన్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, జస్ప్రీత్ బుమ్రాలను అట్టిపెట్టుకుంది. ముంబై కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రాకు అవకాశం ఇవ్వొచ్చంటూ ఊహాగానాలు వెలువడినప్పటికీ హార్దిక్ పాండ్యానే కొనసాగించారు. 

ఇక జట్టుని ఏకంగా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను జట్టులో కొనసాగించారు. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను కూడా ముంబై ఫ్రాంచైజీ వదులుకోలేదు.

సూర్య, రోహిత్, హార్దిక్‌లను రూ.16.35 కోట్ల చొప్పున ముంబై ఫ్రాంచైజీ నిలుపుదల చేసుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను రూ.18 కోట్లతో రిటెయిన్ చేసుకోవడం ఏమంత ఆశ్చర్యంగా అనిపించలేదు. అయితే తిలక్ వర్మను రూ.8 కోట్ల భారీ ధరకు రిటెయిన్ చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. 

జట్టు రిలీజ్ అయిన ఆటగాళ్లు వీళ్లే..
ఇషాన్ కిషన్, అర్జున్ టెండూల్కర్, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వల్, నెహాల్ వధేరా, శామ్స్ ములానీ, విష్ణు వినోద్, పీయూష్ చావ్లా, శ్రేయాస్ గోపాల్, అన్షుల్ కాంబోజ్, శివాలిక్ శర్మ, డెవాల్డ్ బ్రీవిస్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషారా, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోట్జీ, క్వేనా మఫాకా, ల్యూక్ వుడ్.


Mumbai Indians
IPL 2024
Rohit Sharma
Hardik Pandya

More Telugu News