Reliance Jio: జియోఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. దీపావళి స్పెషల్ ఆఫర్ ప్రకటన

Reliance Jio announces Affordable Recharge Plan for Rs 153 as diwali Special offer
  • 28 రోజుల వ్యాలిడిటీతో చవకగా రూ.153 ప్లాన్ ప్రవేశపెట్టిన టెలికం దిగ్గజం
  • 0.5 జీబీ రోజువారీ డేటా.. నెలకు 300 ఎస్ఎంఎస్‌లు లభ్యం
  • జియో టీవీ, జియో సినిమా సబ్‌స్క్రిప్సన్స్ ఉచితం
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో దీపావళి సందర్భంగా మరో స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. జియోఫోన్ యూజర్లకు సరసమైన ధరలో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 28 రోజుల వ్యాలిడిటీతో రూ.153 రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఆఫర్‌లో యూజర్లు అపరిమిత ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. మొత్తం 300 ఉచిత మెసేజులు లభిస్తాయి. ఇక 0.5 జీబీ రోజువారీ డేటా కూడా లభిస్తుంది. అదనంగా జియో టీవీ, జియో సినిమా యాప్స్ ఉచిత సబ్‌స్క్రిప్షన్స్‌ పొందవచ్చు. సినిమాలు, స్పోర్ట్స్ లైవ్స్‌తో అందుబాటులో ఉన్న కంటెంట్‌ను వీక్షించవచ్చు. 

జియోఫోన్ యూజర్లకు రూ. 153 ప్లాన్‌తో పాటు అవసరమైన అదనపు సేవల కోసం కూడా తక్కువ ధరలో ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల రేట్లు రూ.75, రూ.91, రూ.125, రూ.186, రూ.223గా ఉన్నాయి. ఈ ప్లాన్లు అన్నీ జియోఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు వర్తించవని రిలయన్స్ జియో తెలిపింది.

కాగా ప్రైవేటు టెలికం ప్రొవైడర్లు మూడు నెలల క్రితం టారీఫ్ రేట్లను గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఫీచర్ ఫోన్ల రీఛార్జులు కూడా భారీగా పెరిగాయి. దీంతో లక్షలాది మంది వినియోగదారులు రీఛార్జ్ చేసుకోవాలంటేనే వెనక్కి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దీపావళి సీజన్‌లో కస్టమర్లు నిరంతరాయ సేవలు పొందాలనే ఉద్దేశంతో జియో ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.
Reliance Jio
JioPhones
Jio Recharges
Jio

More Telugu News