Hyderabad: హైదరాబాద్‌లో హృదయ విదారక ఘటన... కొడుకు శవంతో ఇంట్లో 4 రోజులు గడిపిన అంధ తల్లిదండ్రులు

Blind couple lives with son body for three days in Hyderabad

  • జైపూరి కాలనీలో విషాధకర ఘటన
  • కొడుకు చనిపోయిన విషయం తెలియక డెడ్ బాడీతోనే గడిపిన దంపతులు
  • దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు

హైదరాబాద్‌లో హృద విదారక సంఘటన చోటుచేసుకుంది. తమ కొడుకు మరణించాడని తెలియక అంధ వృద్ధ దంపతులు అదే ఇంటిలో అతని శవం పక్కనే నాలుగు రోజులు ఉన్నారు. ఈ దయనీయ సంఘటన హైదరాబాద్‌లోని నాగోల్‌లో జరిగింది. ఈ విషయం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

జైపురి కాలనీలో రమణ, శాంతికుమారి అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు ప్రమోద్ నాలుగు రోజుల క్రితం ఇంట్లో మృతి చెందాడు. కానీ వారు అంధులు కాబట్టి తెలియలేదు. ఆ శవంతోనే నాలుగు రోజులు ఉన్నారు.

ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా... 32 ఏళ్ల వ్యక్తి మృతదేహం కనిపించింది. ఇంట్లో 60 ఏళ్లు పైబడిన వృద్ధ దంపతులు ఉన్నారు. ఆ దంపతులు నీరసంగా ఉండటంతో పోలీసులు ఆహారం, నీరు అందించారు.

తమకు భోజనం, నీటి కోసం తమ కుమారుడిని పిలిచామని, కానీ ఎలాంటి స్పందన రాలేదని వృద్ధ దంపతులు పోలీసులకు తెలిపారు. కాగా, యువకుడు నిద్రలోనే మృతి చెందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఆ వృద్ధ దంపతులకు కుమారుడు మద్యానికి బానిస అయినట్టు తెలుస్తోంది. కాగా, ఈ విషయాన్ని పోలీసులు ఆ అంధ దంపతుల పెద్ద కుమారుడు ప్రదీప్ కు తెలియజేశారు. ప్రదీప్ హైదరాబాద్ నగరంలోనే నివాసం ఉంటున్నారు. 

Hyderabad
Son
Mother
  • Loading...

More Telugu News