గుట్కా, పాన్ మసాలాపై పశ్చిమ బెంగాల్ కీలక నిర్ణయం
- గుట్కా, పాన్ మసాలాలపై మరో ఏడాది నిషేధం పొడిగింపు
- ఉత్తర్వులు జారీ చేసిన పశ్చిమ బెంగాల్ సర్కార్
- ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ ఆదేశాలు అని పేర్కొన్న వైద్య ఆరోగ్య శాఖ
నవంబర్ 7వ తేదీ నుంచి ఈ నిషేధం అమలు కానుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు అక్టోబర్ 24న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఫుడ్ సేఫ్టీ చట్టంలోని సెక్షన్ 30 స్టాండర్డ్స్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఈ ఆదేశాలలో పేర్కొన్నారు.