Yennam Srinivas Reddy: కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ జరిగినట్లు ప్రభుత్వం చెప్పలేదు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Yennam Srinivas Reddy responds about KTR brother in law farm house issue
  • 111 జీవోను అతిక్రమిస్తూ రాజ్ పాకాల ఇల్లు ఎలా నిర్మించారని నిలదీత
  • మంత్రిగా పని చేసిన కేటీఆర్‌కు వారెంట్ ఎలా ఇస్తారో తెలియదా? అని ప్రశ్న
  • రాజ్ పాకాల మీడియా ముందుకు వచ్చి ఉండే బాగుండేదన్న శ్రీనివాస్ రెడ్డి
కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని, రేవ్ పార్టీ జరిగినట్లు  మీడియాలో మాత్రమే కథనాలు వచ్చాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అసలు, 111 జీవోను అతిక్రమిస్తూ రాజ్ పాకాల జన్వాడలో ఇల్లు ఎలా నిర్మించారని ప్రశ్నించారు. పదేళ్లు మంత్రిగా పని చేసిన కేటీఆర్‌కు వారెంట్ ఎలా ఇస్తారో తెలియదా? అన్నారు.

అయినా కేసీఆర్ హయాంలో ఫాంహౌస్‌లో స్టింగ్, కోవర్ట్ ఆపరేషన్లు జరిగినట్లుగా ఇప్పుడు జరగడం లేదన్నారు. జన్వాడ ఫాంహౌస్‌లో ఎలాంటి స్టింగ్ ఆపరేషన్ జరగలేదని గుర్తుంచుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ హైలైఫ్ పబ్‌కు రాజ్ పాకాల గతంలో యజమానిగా ఉన్నారని తెలిపారు. డ్రగ్స్ తీసుకున్న జూబ్లీహిల్స్ గ్యాంగ్‌లో రాజ్ పాకాల సభ్యుడనే ప్రచారం కూడా జరిగిందన్నారు.

బీఆర్ఎస్ హయాంలో జుబ్లీహిల్స్ పబ్‌లకు అనుమతులు ఇప్పించింది రాజ్ పాకాలనే అన్నారు. డ్రగ్స్‌కు స్వర్గం అని చెప్పే సన్ బర్న్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడానికి రాజ్ పాకాల ప్రయత్నించారని ఆరోపించారు. జన్వాడ ఫాంహౌస్ ఘటనపై రాజ్ పాకాల మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని రాజ్ పాకాల నిరూపించుకోవాలన్నారు. విజయ్ మద్దూరి స్టేట్ మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన స్టేట్‌మెంట్‌ను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు.
Yennam Srinivas Reddy
BRS
Congress
KTR
Raj Pakala

More Telugu News