Kolusu Parthasarathy: విద్యుత్ చార్జీల గురించి జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది: మంత్రి పార్థసారథి

Minister Kolusu Parthasarathy Jagan words are ridiculous on electricity charges
  • గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిందన్న పార్థసారథి
  • జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారని విమర్శలు
  • అందుకే రూ.6,072 కోట్ల ట్రూ అప్ భారం పడిందని వెల్లడి 
ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి మాజీ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వ హయాంలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని, ఇప్పుడు జగన్ విద్యుత్ చార్జీల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. 

ట్రూప్ అప్ చార్జీలపై ఈఆర్సీ ప్రతిపాదన జగన్ ప్రభుత్వం చేసిన పాపమేనని వ్యాఖ్యానించారు. నాడు జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రూ.6,072 కోట్ల మేర ట్రూప్ అప్ చార్జీల భారం పడిందని మంత్రి పార్థసారథి ఆరోపించారు.
Kolusu Parthasarathy
Jagan
Electricity charges
TDP-JanaSena-BJP Alliance
YSRCP

More Telugu News