Errabelli: వారి మాటలు చూస్తుంటే ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోయేలా కనిపిస్తోంది: ఎర్రబెల్లి దయాకరరావు

Errabelli Dayakar Rao hot comments
  • రెండు మూడు రోజుల్లో బాంబులు పేలుతాయన్న పొంగులేటికి కౌంటర్
  • కాంగ్రెస్ నేతలే పరస్పరం బాంబులు వేసుకుంటున్నారన్న మాజీ మంత్రి
  • బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న ఎర్రబెల్లి
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బాధ, ఆయనకు మద్దతుగా మరో నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మరో ఆరు నెలల్లోనే ప్రభుత్వం పడిపోయేలా కనిపిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

జనగామలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రెండు మూడు రోజుల్లో తెలంగాణలో బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారని, కానీ బాంబులు పేలేది బీఆర్ఎస్‌లో కాదన్నారు. కాంగ్రెస్ నేతలే పరస్పరం బాంబులు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. 

లకావత్ శ్రీను నాయక్ అనే వ్యక్తి వారం క్రితం పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీను మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనగామలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఎర్రబెల్లి... శ్రీను నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Errabelli
BRS
Congress
Jeevan Reddy

More Telugu News