Reliance Jio: ‘దివాలీ ధమాకా ఆఫర్’ ప్రకటించిన జియో.. బెనిఫిట్స్ అదుర్స్

Reliance Jio has introduced an offer for its subscribers called the Diwali Dhamaka Offer
  • రూ.899, రూ.3,599 రీఛార్జులతో లభించనున్న వేల రూపాయల విలువైన గిఫ్ట్ వోచర్లు
  • ట్రావెలింగ్ సర్వీసులు, ఫుడ్ డెలివరీ యాప్స్, ఆన్‌లైన్ రిటైల్ వెబ్‌సైట్స్‌పై ఉపయోగించుకునే అవకాశం
  • నవంబర్ 5 వరకు కొనసాగనున్న ప్రత్యేక ఆఫర్ 
రిలయన్స్ జియో తన యూజర్ల కోసం ‘దివాలీ ధమాకా ఆఫర్’ పేరిట ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. రెండు నిర్దిష్ట రీఛార్జ్ ప్లాన్‌లతో వేల రూపాయల విలువైన గిఫ్ట్ వోచర్లు ప్రయోజనంగా పొందవచ్చని తెలిపింది. రూ. 899, రూ.3,599 ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే యూజర్లకు ఈ ప్రత్యేక బెనిఫిట్స్ అందుతాయని తెలిపింది. పండుగ సీజన్‌లో వినియోగదారులకు లభించే గిఫ్ట్ వోచర్లను ట్రావెల్ సర్వీసులు, ఫుడ్ డెలివరీ యాప్స్, ఆన్‌లైన్ రిటైల్ వెబ్‌సైట్లతో వివిధ ప్లాట్‌ఫామ్స్‌పై ఉపయోగించవచ్చని సూచించింది. ప్రకటించిన రెండు ప్లాన్లలో ఏదో ఒక దానితో రీఛార్జ్ చేసుకుంటే రూ.3,500 వరకు ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని వివరించింది.

కాగా జియో వోచర్ల జాబితాలో ప్రయాణ ఖర్చులకు రూ. 3,000 విలువైన ‘ఈజీ మై ట్రిప్ వోచర్’, రూ.200 విలువైన ‘ఎజియో వోచర్’, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసుల కోసం రూ.150 వోచర్ ఉన్నాయి. కాగా ఈ ప్రత్యేక ఆఫర్ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 5 వరకు కొనసాగుతుందని తెలిపింది. ఈ ఆఫర్‌ను పొందాలనుకునే యూజర్లు మైజియో యాప్‌లో ఆఫర్స్ విభాగానికి వెళ్లి రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసిన తర్వాత ఈ వోచర్‌లు కనిపిస్తాయి.

కాగా జియో రూ.899 ప్లాన్‌ వ్యాలిడిటీ 3 నెలలుగా ఉంది. 2జీబీ రోజువారీ డేటాతో పాటు అదనంగా 20జీబీ డేటా లభిస్తుంది. ఇక రూ.3,599 ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. 2.5జీబీ రోజువారీ డేటా లభిస్తుంది. ఇక ఈ రెండు ప్లాన్లలోనూ అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 మెసేజ్‌లు, ఉచిత నేషనల్ రోమింగ్, అపరిమిత 5జీ సేవలు లభిస్తాయి.
Reliance Jio
Jio Recharge plans
Recharge Offers
Business News

More Telugu News