Tirupati: తిరుపతిలో మరో‌సారి బాంబు బెదిరింపుల కలకలం

bomb threats to raj park hotel in tirupati
  • తిరుపతిలో మరో హోటల్‌కు బాంబు బెదిరింపులు
  • రాజ్ పార్క్ హోటల్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు
  • కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని మరో హోటల్‌కు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్‌కు బాంబు బెదిరింపులు రావడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హోటల్‌కు చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మరో వైపు గురువారం లీలామహాల్ సమీపంలోని మూడు హోటల్స్, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో పోలీసులు తనిఖీలు జరిపిన విషయం తెలిసిందే. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేశారు. అయితే ఎక్కడా పేలుడు పదార్ధాలు లేవని నిర్ధారణ కావడంతో ఊపిరిపీల్చుకున్నారు. బాంబు బెదిరింపు కాల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
Tirupati
bomb threat
Andhra Pradesh

More Telugu News