Crime News: పెళ్లి చేసుకోమన్నందుకు 7 నెలల గర్భవతిని కడతేర్చిన బాయ్‌ఫ్రెండ్

A pregnant teenager was  killed and buried by her boyfriend in Delhi
  • పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కిరాతకం
  • ఇద్దరు స్నేహితులతో కలిసి చంపేసి పాతిపెట్టిన వైనం
  • ఢిల్లీలో వెలుగు చూసిన షాకింగ్ ఘటన
ప్రేమించినవాడే రాక్షసుడయ్యాడు. కనీసం గర్భవతి అనే కనికరం కూడా లేకుండా కడతేర్చాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. 19 సంవత్సరాల సోనీ అనే యువతిని ఆమె ప్రియుడు సంజు అలియాస్ సలీమ్‌ హత్య చేశాడు. గర్భవతి అయిన సోనీ తనను పెళ్లి చేసుకోవాలని సలీమ్‌ను కోరింది. ఇదే విషయంపై ఇద్దరి మధ్యా కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఏడు నెలల గర్భవతి అయిన సోనీ ఇటీవలే తన ఇంట్లో నుంచి కొన్ని వస్తువులు తీసుకొని ప్రియుడు సలీమ్ వద్దకు వెళ్లిపోయింది. 

అయితే పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేని సలీమ్ ఇద్దరు స్నేహితులను వెంటబెట్టుకొని సోనీని హర్యానాలోని రోహ్‌తక్‌ తీసుకెళ్లాడు. అక్కడ ముగ్గురు కలిసి ఆమెను హత్య చేశారు. మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టారు. సోనీ మిస్సింగ్‌పై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది.

సలీమ్‌తో పాటు అతడికి సాయం చేసిన ఇద్దరు స్నేహితుల్లో ఒకరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నారని, అతడి కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితుడు సలీమ్‌కు సోనీని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని, అబార్షన్ చేయించుకోవాలని ఆమెతో గొడవ పడుతుండేవాడని తెలిసిందని పేర్కొన్నారు.

కాగా పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్‌ ప్రాంతానికి చెందిన సోనీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. ఆమెకు 6,000లకు పైగా మంది ఫాలోయర్స్ ఉన్నారు. ప్రియుడు సలీమ్‌తో కలిసి ఉన్న అనేక ఫొటోలు, వీడియోలను ఆమె పోస్ట్ చేసింది. సలీమ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో సోనీ ఫొటోలను షేర్ చేసేవాడని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై సోనీ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోనీ కొత్తగా ఎవరితోనో స్నేహం చేస్తోందని తమకు తెలుసునని, అయితే ఎవరితో మాట్లాడుతున్నావంటే దెయ్యంతో అని చెబుతుండేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
Crime News
New Delhi
Viral News
Trending News

More Telugu News