Amaravati: అమరావతి పనులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

tenders will be recalled for works related to capital amaravati construction
  • అమరావతి నిర్మాణంలో భాగంగా గతంలో పిలిచిన కాంట్రాక్టులు 15 రోజుల్లో రద్దు చేస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడి
  • నవంబర్, డిసెంబర్ నెలల్లో అన్ని పనులకు కొత్తగా టెండర్లు 
  • సచివాలయ భవనాల నిర్మాణాలకు డిసెంబర్‌లో, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు జనవరి నెలాఖరులో టెండర్ల ఖరారు
రాజధాని అమరావతి పనులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడంతో అమరావతిలో రాజధాని నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయాయి. 2019 ఎన్నికలకు ముందు చేపట్టిన పనులు నిలిచిపోయాయి. ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని పనులకు అమరావతిలో కదలిక ప్రారంభమైంది. 

ఇప్పటికే రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణాలపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతి నిర్మాణంలో భాగంగా గతంలో పిలిచిన కాంట్రాక్టులను 15 రోజుల్లో రద్దు చేసి కొత్తవి ఆహ్వానించనున్నట్లు మంత్రి తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో అన్ని పనులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. 

360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, లే అవుట్లు, కొండవీటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్, కరకట్ట రోడ్డుకు టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. సచివాలయ భవనాల నిర్మాణాలకు డిసెంబర్‌లో, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో టెండర్లు ఖరారు చేస్తామని వెల్లడించారు. అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం శుభపరిణామమంటూ ఈ సందర్బంగా మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు.   
Amaravati
Minister
Ponguru Narayana

More Telugu News