పవన్ కల్యాణ్, చంద్రబాబు చొరవ పట్ల అభినందిస్తున్నా: మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ కేటాయించిన కేంద్రం
- రణస్థలం ప్రాంతానికి ఎలివేటెడ్ కారిడార్
- నేడు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
అమరావతి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు, రణస్థలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు ఏపీ అనుసంధానానికి, మౌలిక సదుపాయాల రంగానికి గణనీయంగా ఊతమిస్తాయని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు గుణాత్మక అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.