Ramcharan: స్నేహితుడికి రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే విషెస్‌

Global Star Ramcharan Brithday Wishes to Friend Vikram Reddy
  
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న మిత్రుడు, యూవీ క్రియేష‌న్స్ నిర్మాణ సంస్థ‌లో భాగ‌స్వామి అయిన‌ విక్రమ్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పెష‌ల్‌గా ఒక పోస్ట్ పెట్టారు. 

"నా ప్రియమైన మిత్రుడు విక్రమ్‌రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు అద్భుత‌మైన‌ కథలు చెప్పడం కొనసాగించండి. మీకు మ‌రోసారి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు. మీ 'విశ్వంభర' మూవీకి ఆల్ ది బెస్ట్" అంటూ చెర్రీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు త‌న‌ మిత్రులు హీరో శ‌ర్వానంద్‌, విక్ర‌మ్ రెడ్డితో క‌లిసి దిగిన ఫొటోను చ‌ర‌ణ్ జోడించారు.

కాగా, మెగాస్టార్ చిరంజీవి, యువ ద‌ర్శ‌కుడు వశిష్ఠ కాంబినేష‌న్‌లో 'విశ్వంభ‌ర' చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. 
Ramcharan
Vikram Reddy
Brithday Wishes
UV Creations
Tollywood

More Telugu News