డ్రోన్ స‌మ్మిట్ ప్రారంభం

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌డుతున్న అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌-2024 ప్రారంభ‌మైంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు చేతుల‌మీదుగా మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్ష‌న్ వేదిక‌గా ఈ స‌మ్మిట్‌ ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా డ్రోన్ల వినియోగంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను దేశంలోనే టాప్‌లో ఉండేలా ఈ స‌ద‌స్సు తొలి అడుగు కావాల‌ని ముఖ్య‌మంత్రి ఆకాంక్షించారు. 

రెండు రోజుల‌పాటు ఈ స‌మ్మిట్ జాతీయ‌స్థాయిలో జ‌రుగుతుంద‌ని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 50 స్టాళ్ల‌లో డ్రోన్ల ప్ర‌ద‌ర్శ‌న‌, రాష్ట్ర ముసాయిదా డ్రోన్ పాల‌సీ ప‌త్రం ఆవిష్క‌ర‌ణ‌, తొమ్మిది ప్యాన‌ల్ డిస్క‌ష‌న్లు త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని తెలిపారు.  

Amaravati Drone Summit 2024
Andhra Pradesh
Chandrababu

More Telugu News