Haripriya: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియపై కేసు నమోదు

Police filed case against BRS Ex MLA Haripriya
  • రైతు భరోసా ఇవ్వాలంటూ హరిప్రియ ధర్నా
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
  • ప్రభుత్వాన్ని కించపరిచేలా కార్యక్రమం నిర్వహించారంటూ పోలీసు కేసు నమోదు
ఖమ్మం జిల్లా ఇల్లెందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ పిలుపు మేరకు ఇల్లెందులో హరిప్రియ, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ దిండిగల రాజేందర్ తో పాటు మరో 30 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 

ఈ నేపథ్యంలో హరిప్రియతో పాటు ధర్నాలో పాల్గొన్న వారందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా కార్యక్రమాన్ని నిర్వహించారంటూ కేసు బుక్ చేశారు. 
Haripriya
BRS

More Telugu News