Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపుపై పోలీసులకు మరో మెసేజ్

Days after 5 crore death threat to Salman Khan sender apologises
  • సల్మాన్ ఖాన్‌ను బెదిరించి తప్పు చేశానంటూ నిందితుడి నుంచి సందేశం
  • లారెన్స్ బిష్ణోయ్‍‌తో వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని అంతకుముందు మెసేజ్
  • లేదంటే బాబా సిద్ధిఖీ కంటే దారుణ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించి తప్పు చేశానని నిందితుడి నుంచి పోలీసులకు వాట్సాప్ సందేశం వచ్చింది. కృష్ణ జింకను వేటాడిన కేసులో బిష్ణోయ్ వర్గం సల్మాన్ ఖాన్‌పై ఆగ్రహంగా ఉంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో వైరానికి ముగింపు పలకాలంటే సల్మాన్ ఖాన్ రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు మూడు రోజుల క్రితం ముంబై ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ వచ్చింది.

ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యను తామే చేసినట్లు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. ఈ క్రమంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని అక్టోబర్ 18న ముంబై ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ వచ్చింది. లేదంటే సిద్ధిఖీ కంటే దారుణ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.

అయితే, ఈరోజు అదే నెంబర్ నుంచి పశ్చాత్తాపపడుతూ మెసేజ్ వచ్చింది.సల్మాన్ ఖాన్‌ను బెదిరించి తప్పు చేశానని, అందుకు తనను క్షమించాలని ఆ సందేశంలో ఉంది. ఈ మేరకు ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ మెసేజ్‌లు ఝార్ఖండ్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం పోలీసు బృందాలు ఝార్ఖండ్ వెళ్లాయి.
Salman Khan
Lawrence Bishnoi
Bollywood

More Telugu News