Pawan Kalyan: డ‌యేరియా వ్యాప్తిపై అధికారుల‌తో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మీక్ష‌

Deputy CM Pawan Kalyan Review Meeting
  • డ‌యేరియా వ్యాప్తి, కార‌ణాల‌పై విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌రేట్‌లో అధికారుల‌తో ప‌వ‌న్‌ స‌మీక్ష
  • గుర్ల గ్రామ‌స్థుల‌తో ఉప ముఖ్య‌మంత్రి ముఖాముఖి
  • డిప్యూటీ సీఎం దృష్టికి మూడు ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను తీసుకెళ్లిన గ్రామ‌స్థులు
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ గుర్ల గ్రామంలో డ‌యేరియా వ్యాప్తి, కార‌ణాల‌పై విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌రేట్‌లో అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. తన పర్యటన సందర్భంగా గుర్ల గ్రామ‌స్థుల‌తో ఉప ముఖ్య‌మంత్రి ముఖాముఖి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

దీంతో డిప్యూటీ సీఎం దృష్టికి గ్రామ‌స్థులు మూడు ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను తీసుకెళ్లారు. మంచినీటి ట్యాంకులు ఎక్కువ రోజులు శుభ్రం చేయ‌డంలేద‌ని గ్రామ‌స్థులు తెలిపారు. అలాగే ఒకే ఒక్క ట్యాంకు ఉండ‌డం వ‌ల్ల తాగునీటి స‌మ‌స్య వ‌స్తోంద‌న్నారు. ఈ మేర‌కు త‌మ స‌మ‌స్య‌ల‌పై వారు జ‌న‌సేనానికి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. 
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News