Chandrababu: తన కాళ్లకు నమస్కరించిన వ్యక్తి కాళ్లు మొక్కిన చంద్రబాబు.. వీడియో ఇదిగో!

AP CM Chandrababu Touches Worker Feet
       
తన కాళ్లకు మొక్కేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే తిరిగి తాను కూడా అదే పనిచేస్తానంటూ గతంలోనే హెచ్చరించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనంత పనీ చేశారు. రాజధాని అమరావతిలోని సీఆర్‌డీఏ కార్యాలయ నిర్మాణ పనుల్ని నిన్న ప్రారంభించేందుకు వచ్చిన చంద్రబాబు కాళ్లకు ఓ వ్యక్తి నమస్కరించాడు. వెంటనే స్పందించిన చంద్రబాబు ‘నన్ను కూడా మీ కాళ్లకు నమస్కారం చేయమంటారా?’ అని ఆ వ్యక్తి కాళ్లు పట్టుకునేందుకు వంగారు. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాకయ్యాడు.

తన కాళ్లకు ఎవరూ నమస్కారం చేయొద్దని, తల్లిదండ్రులు, గురువుల కాళ్లకు మాత్రమే నమస్కారం చేయాలని చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్నారు. ఎవరైనా తన కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేస్తే తను కూడా అదే పనిచేస్తానని ఇటీవల చంద్రబాబు హెచ్చరించిన విషయం తెలిసిందే.
Chandrababu
Andhra Pradesh
Amaravati
TDP

More Telugu News