Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం .. 12 మంది దుర్మరణం

rajasthan road accident major accident in dholpur several people died
  • టెంపోను ఢీకొన్న స్లీపర్ బస్సు
  • తొమ్మిది మంది చిన్నారుల సహా 12 మంది మృతి
  • రాజస్థాన్ రాష్ట్రం ధోల్‌పుల్లాలో ఘటన
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృత్యువాత పడ్డారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. టెంపోను స్లీపర్ బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బారీ నగరంలోని కరీం కాలనీ గుమర్ మొహల్లాకు చెందిన నహ్నూ, జహీర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి నిన్న బరౌలీ గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజయ్యారు. అనంతరం టెంపోలో రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు.

సునిపూర్ గ్రామ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న టెంపోను ఎదురుగా అతి వేగంగా వచ్చిన స్లీపర్ బస్సు ఢీకొట్టింది. జాతీయ రహదారిపై వెళ్లే ఇతర వాహనాల డ్రైవర్లు వెంటనే ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించారు.  వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మొత్తం 12 మంది మృతి చెందగా, వీరిలో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో బస్సు డ్రైవర్, క్లీనర్ కూడా ఉన్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. అడిషనల్ ఎస్పీ ఏడీఎఫ్ కమల్ కుమార్ జాంగీద్, సబ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దుర్గాప్రసాద్ మీనా, సర్కిల్ ఆఫీసర్ మహేంద్ర  కుమార్ మీనా తదితర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   
Rajasthan
Road Accident

More Telugu News