Jammu And Kashmir: జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై కేబినెట్ తీర్మానం

JK LG clears resolution passed by Omar Abdullah led Cabinet urging Centre to restore Statehood
  • రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ కేబినెట్ తీర్మానం
  • తీర్మానానికి ఆమోదం తెలిపిన లెఫ్టినెంట్ గవర్నర్
  • కేంద్రంతో చర్చించేందుకు త్వరలో ఢిల్లీకి సీఎం ఒమర్ అబ్దుల్లా
జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఒమర్ అబ్దుల్లా కేబినెట్ తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు. రాష్ట్ర హోదా అంశాన్ని ప్రధానితో పాటు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడానికి ఈ కేబినెట్ సమావేశం అంగీకారం తెలిపింది. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించిన అంశంపై కేంద్రంతో చర్చించేందుకు సీఎం ఒమర్ అబ్దుల్లా త్వరలో ఢిల్లీ వెళతారని అధికారులు తెలిపారు.

నవంబర్ 4న తొలి శాసన సభా సమావేశం జరగనుంది. ఈ మేరకు కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ప్రొటెం స్పీకర్‌గా ముబారిక్ గుల్‌ను నియమించేందుకు కేబినెట్ సిఫారసు చేసింది. పూర్తిస్థాయి స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ముబారిక్ గుల్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Jammu And Kashmir
Telangana
Cabinet Meeting

More Telugu News