Telangana: రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌కు ఈడీ సమన్లు

ED issues summons to Rangareddy former collector
   
రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌కు కేంద్ర దర్యాఫ్తు సంస్థ నుంచి నోటీసులు వచ్చాయి. భూకేటాయింపులకు సంబంధించి ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 22 లేదా 23వ తేదీన అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది.

ఏం జరిగింది?

అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. అబ్దుల్లాపూర్‌మెంట్ మండలం పిగ్లిపూర్ రెవెన్యూ పరిధిలోని 17 సర్వే నెంబర్‌లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 386 ఎకరాల భూమి ఉంది. ఇందులో 75 ఎకరాలు భూదాన్ యజ్ఞ బోర్డు భూమి కాగా, మరో 61 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 53 ఎకరాల సీలింగ్ భూమి, 197 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇందులోని సీలింగ్ భూమిలో 16 మంది రైతులకు 45 ఎకరాలు ఉంది. ఈ భూమిని ఆ రైతులు వారి తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్నారు.

ఇదే 17 సర్వే నెంబర్‌లోని 26 ఎకరాల ప్రైవేటు భూమిలో మెరుగు గోపాల్ యాదవ్ వెంచర్ వేసి, సీలింగ్ భూమిని కూడా కలుపుకున్నాడు. దీనికి సంబంధించి రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు... రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లారు. ధరణిలో చూస్తే సీలింగ్ పట్టా భూమిగా చూపిస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక నాయకులు, తహసీల్దారు, కలెక్టర్ అమోయ్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నాటి అధికార పార్టీ ముఖ్య నేతలతో పరిచయాల కారణంగా... తమ భూముల్లో వెంచర్ వేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాటి కలెక్టర్ అమోయ్ కుమార్ పాత్రపై తేల్చేందుకు విచారణకు హాజరు కావాలని ఈడీ మాజీ కలెక్టర్‌కు సమన్లు జారీ చేసింది.
Telangana
Hyderabad
ED

More Telugu News