Viral Videos: డ్రైవింగ్ నేర్చుకుంటుండగా షాకింగ్ ఘ‌ట‌న‌.. చెరువులో ల్యాండ్ అయిన కారు.. వైర‌ల్ వీడియో!

Shocking Incident in Jangaon Video goes Viral on Social Media
  • జ‌న‌గామ జిల్లా బతుకమ్మ కుంటలో ఘ‌ట‌న‌
  • చెరువు పక్కన ఉన్న గ్రౌండ్‌లో ఓ వ్యక్తి మరో వ్యక్తికి కారు నేర్పుతుండ‌గా దుర్ఘ‌ట‌న‌
  • కారు నేర్చుకుంటున్న వ్య‌క్తి బ్రేక్‌కు బదులుగా యాక్సిలేటర్‌ తొక్కడంతో చెరువులోకి దూసుకెళ్లి వాహ‌నం
డ్రైవింగ్ నేర్చుకుంటుండగా షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. డ్రైవింగ్ నేర్చుకుంటుండగా కారు చెరువులోకి దూసుకెళ్లింది. తెలంగాణ‌లోని జ‌న‌గామ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. డ్రైవింగ్‌ నేర్చుకుంటున్న వ్యక్తి, నేర్పుతున్న వ్యక్తి ఇద్దరూ కారులోనే చిక్కుకుపోయారు. స్థానికులు గమనించి వారికి సాయం చేయడంతో ఇద్దరూ సురక్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. 

జనగామలోని స్థానిక‌ బతుకమ్మ కుంట పక్కన ఉన్న గ్రౌండ్‌లో ఓ వ్యక్తి మరో వ్యక్తికి కారు డ్రైవింగ్‌ నేర్పుతున్నాడు. ఈ క్రమంలో అయోమయానికి గురైన కారు నేర్చుకుంటున్న వ్య‌క్తి బ్రేక్‌కు బదులుగా యాక్సిలేటర్‌ తొక్కాడు. దాంతో కారు నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది. 

ఇది గమనించిన స్థానికుల్లో ఒక‌రు ఈదుకుంటూ బాధితుల వ‌ద్ద‌కు వెళ్లాడు. డోర్ తీసి బ‌య‌ట‌కు రావాల‌ని సూచించాడు. కానీ, కారు డోర్ తెరుచుకోలేదు. దాంతో విండోలోంచి దూకిన వారిద్ద‌రూ స్థానికుడి సాయంతో బయట పడ్డారు. ఈ ఘటనకు తాలూకు వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Videos
Shocking Incident
Jangaon District
Telangana

More Telugu News