Cyber Crime: అర్ధ‌రాత్రి తెలంగాణ‌ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియోకాల్‌.. పోలీసుల‌కు ఫిర్యాదు!

Telangana MLA Received Nude Video Call from Unknown Persons
  • ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు న‌గ్న వీడియోకాల్‌
  • ఈ నెల 14న అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత గుర్తు తెలియ‌ని నంబ‌ర్ నుంచి వీడియోకాల్  
  • కాల్ లిఫ్ట్ చేయ‌గా ఫోన్ తెర‌పై న‌గ్నంగా ప్ర‌త్య‌క్ష‌మైన‌ ఓ మ‌హిళ  
  • నేష‌న‌ల్ సైబ‌ర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్ట‌ల్‌కు ఫిర్యాదు
  • సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరోలో కేసు న‌మోదు
అర్ధ‌రాత్రి తెలంగాణ‌ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియోకాల్ రావ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. దాంతో అప్ర‌మ‌త్త‌మైన ఆయ‌న వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేర‌కు సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరోలో కేసు న‌మోదైంది. 

వివ‌రాల్లోకి వెళితే.. ఈ నెల 14న అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు గుర్తు తెలియ‌ని నంబ‌ర్ నుంచి వీడియోకాల్ వ‌చ్చింది. దాంతో ఆ వీడియో కాల్‌ను ఎమ్మెల్యే లిఫ్ట్ చేశారు. అంతే.. ఫోన్ తెర‌పై ఓ మ‌హిళ న‌గ్నంగా క‌నిపించ‌డంతో షాక‌య్యారు. వెంట‌నే కాల్ క‌ట్ చేసేశారు. 

ఎవ‌రైనా త‌న‌ను ఇరికించ‌డానికి ఇలా న్యూడ్ కాల్ చేశారా? లేక నిజంగానే గుర్తుతెలియ‌ని వ్య‌క్తులే చేసి ఉంటారా? అనే అనుమానంతో ఆయ‌న పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. నేష‌న‌ల్ సైబ‌ర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్ట‌ల్‌కు ఫిర్యాదు చేశారు. 

అలాగే గురువారం తెలంగాణ సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) లో కూడా లిఖిత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 
Cyber Crime
Telangana
MLA
** Video Call
Karimnagar District

More Telugu News