Chandrababu: లిక్కర్ స్కాంలో జగన్ త్వరలోనే జైలుకెళ్లడం ఖాయం: టీడీపీ ఎమ్మెల్యే జీవీ

TDP MLA GV Anjaneyulu condemns Jagan remarks over Chandrababu
  • ఇవాళ జగన్ ప్రెస్ మీట్
  • చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
  • కౌంటర్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే జీవీ
  • జగన్ దిగజారుడు విమర్శలు చేస్తున్నారని వెల్లడి
వైసీపీ అధినేత జగన్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. జగన్ వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంపై జగన్ దిగజారుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

లిక్కర్ స్కాంలో త్వరలోనే జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. మద్యం లైసెన్సులు ఇచ్చిందెవరో, లక్ష కోట్లు బొక్కిందెవరో... తీరిగ్గా జైల్లో లెక్కలు వేసుకోవచ్చని వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఇవాళ జగన్ ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానిస్తూ... స్కిల్ డెవలప్ మెంట్ లో కేసులో చంద్రబాబుకు టీడీపీ క్లీన్ చిట్ ఇచ్చుకుందంటూ విమర్శలు చేశారు. చంద్రబాబును ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేయదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన సొమ్ము చంద్రబాబు జేబులోకే పోయిందని ఆరోపించారు.
Chandrababu
Jagan
GV Anjaneyulu
TDP
YSRCP

More Telugu News