Supreme Court: బాల్య వివాహాల కట్టడికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

Supreme Court Guidelines On Child Marriages
  • బాల్య వివాహాల నిరోధక చట్టం అమలుకు వ్యక్తిగత చట్టాలు అడ్డంకి కారాదన్న‌ న్యాయస్థానం
  • సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, మనోజ్ మిశ్రా, జేబీ పార్ధీవాలాతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు
  • బాల్యంలో పెళ్లి చేస్తే, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను హరించినట్లేన‌న్న కోర్టు
బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాల్య వివాహాల నిరోధక చట్టం అమలుకు వ్యక్తిగత చట్టాలు అడ్డంకి కారాదని న్యాయస్థానం అభిప్రాయ‌ప‌డింది. దేశంలో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జేబీ పార్ధీవాలాతో కూడిన ధర్మాసనం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. 

ఈ సంద‌ర్భంగా బాల్యంలో పెళ్లి చేస్తే, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను హరించినట్లే అవుతుందని అత్యున్న‌త న్యాయ‌స్థానం పేర్కొంది. బాల్య వివాహాలు, మైనర్ల రక్షణపై అధికారులు దృష్టి సారించాలని సూచించింది. నేరస్థులకు జరిమానా విధించాలని తెలిపింది. వ్యక్తిగత చట్టాలతో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అడ్డుకోవద్దని అభిప్రాయపడింది. 
Supreme Court
Child Marriages

More Telugu News