Mahesh babu: రెండు భాగాలుగా మహేశ్-రాజమౌళి సినిమా?

Mahesh Rajamouli movie in two parts
  • యాక్షన్‌ అడ్వెంచర్ మూవీగా మహేశ్ సినిమా 
  • వరుస సీక్వెల్స్‌గా తీసుకురావడానికి ప్లానింగ్  
  • విదేశీ భాషల్లోనూ విడుదలకు సన్నాహాలు
మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో త్వరలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం గురించి ఎటువంటి అప్‌డేట్‌ వచ్చినా సెన్సేషన్‌ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన గెటప్‌, లుక్‌ కోసం మహేశ్ మేకోవర్‌లో వుండగా, దర్శకుడు రాజమౌళి మాత్రం కథపై కసరత్తులు చేస్తున్నాడు. 

జనవరిలో ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి మరో వార్త వినిపిస్తోంది. మహేశ్-రాజమౌళి సినిమా రెండు భాగాలుగా రాబోతుందనే న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అమెజాన్ అడవుల నేపథ్యంలో కొనసాగే ఈ కథను ఒకే భాగంలో చెప్పడం సాధ్యమయ్యే విధంగా లేదని రాజమౌళి అండ్‌ ఆయన బృందం ఆలోచనలో వున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి రూపొందిస్తున్న ఈ చిత్రం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చిత్ర యూనిట్‌ ముందే నిర్ణయం తీసుకుందట. 

ఈ చిత్రంలో ఇండియన్‌ ఆర్టిస్టులతో పాటు విదేశీ నటీనటులను కూడా ఎంపిక చేస్తున్నారని తెలిసింది. అంతేకాదు ఇండియానా జోన్స్‌ మాదిరిగా ఈ చిత్రం సీక్వెల్‌లు ఒకదాని తరువాత మరొకటి వచ్చే అవకాశాలు కూడా వున్నాయని అంటున్నారు. విజయేంద్రపసాద్‌ కథను అందిస్తున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్నారు. అన్ని భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇక చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. 
Mahesh babu
Rajamouli
Mahesh Rajamouli movie in two parts
SSMB29
Mahesh babu latest movie
Telugu cinema

More Telugu News