పాకిస్థాన్‌లోని సదస్సుకు నరేంద్రమోదీ వస్తే సంతోషించేవాడిని: నవాజ్ షరీఫ్
- పాక్‌లో ఎస్సీవో సదస్సుకు హాజరైన జైశంకర్
- జైశంకర్ రాక సానుకూల పరిణామమన్న నవాజ్ షరీఫ్
- మరో 75 ఏళ్లు నష్టపోవద్దన్న నవాజ్ షరీఫ్
గతాన్ని పక్కనపెట్టి ఇంధనం, వాతావరణ మార్పుల వంటి భవిష్యత్తు సవాళ్లను పరిష్కరించుకోవాలన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య చాలాకాలంగా నిలిచిపోయిన శాంతిచర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాలు పురోగతి సాధించాలంటే ఉద్రిక్తతలు ఉండరాదన్నారు. దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారంపై స్పందిస్తూ... చర్చలను ఎక్కడ ఆపేశామో... అక్కడి నుంచి తిరిగి ప్రారంభించాలన్నారు.