Vistara flight: ఈసారి ఫ్రాంక్‌ఫర్ట్-ముంబై విస్తారా విమానానికి బెదిరింపు.. నాలుగు రోజుల్లో 13వ ఘటన
![Vistara Flight To Mumbai From Frankfurt Bomb Threat](https://imgd.ap7am.com/thumbnail/cr-20241017tn6710a90f56bc2.jpg)
భారతీయ విమానాలకు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ముంబైకి వెళ్తున్న విస్తారా విమానానికి సోషల్ మీడియా ద్వారా బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ముంబైలోని చత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేసి ఐసోలేషన్‌కు తరలించి తనఖీలు చేస్తున్నారు. గత నాలుగు రోజుల్లో ఇది 13వ బెదిరింపు కావడం గమనార్హం.
వరుస బెదిరింపుల కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ విమానాలకు బెదిరింపులు ఎదురయ్యాయి. తాజా ఘటనలో తాజా విమానం యూకే 028లోని ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్టు విస్తారా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.