Vettaiyan: అందరికీ అందుబాటులో ఉండేలా రజినీకాంత్ ‘వేట్టయన్’ టికెట్ రేట్లు

Rajinikanth Vettaiyan ticket prices reduced to affordable for everyone
  • రజనీకాంత్ ప్రధాన పాత్రలో వేట్టయన్ చిత్రం
  • టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో చిత్రం
  • దసరా సందర్భంగా అక్టోబరు 10న విడుదల
  • తాజాగా తెలంగాణలో టికెట్ రేట్లు తగ్గింపు
సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అందరికీ తెలిసిందే. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. సుభాస్క‌ర‌న్ నిర్మాతగా వ్యవహరించారు. 

ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేసింది. గ్లోబల్ గా అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. 

ఇక దసరా సెలవులు ముగియడంతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా తెలంగాణలో ఈ మూవీ టికెట్ రేట్లను తగ్గించారు. మల్టీ ప్లెక్సుల్లో రూ.200, సిటీ సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ.110గా టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు. ఈ రేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. టికెట్ రేట్ల తగ్గింపు వల్ల వేట్టయన్ చిత్రానికి ప్రేక్షకుల తాకిడి పెరుగుతుందని, తద్వారా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 

ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషారా విజయన్ నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలకంగా మారింది. న్యాయం, అధికారం, ఎన్‌కౌంటర్ హత్య, అవినీతి విద్యా వ్యవస్థ ఇతివృత్తాలను ఈ సినిమాలో ఎంతో పవర్ ఫుల్ గా చూపించారు. 

వేట్టయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.240 కోట్లను అధిగమించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో టికెట్ రేట్లు తగ్గించడంతో మరింతగా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.
Vettaiyan
Rajinikanth
Ticket Rates
Telangana

More Telugu News