AP Liquor: మద్యంపై 2 శాతం సెస్ విధించిన ఏపీ ప్రభుత్వం

AP Govt imposed 2 percent cess on liquor sales
  • రేపటి నుంచి ప్రారంభం కానున్న కొత్త వైన్ షాపులు
  • రిహాబిలిటేషన్ సెస్ విధించిన ఏపీ ప్రభుత్వం
  • ఈ ఆదాయాన్ని డ్రగ్స్ నియంత్రణ, రిహాబిలిటేషన్ సెంటర్లకు వినియోగిస్తామని వెల్లడి
ఏపీలో రేపటి నుంచి కొత్త వైన్ షాపులు ప్రారంభం కానున్నాయి. దీనికి ఒక రోజు ముందే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యంపై 2 శాతం సెస్ విధిస్తున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని డ్రగ్స్ నియంత్రణ, రిహాబిలిటేషన్ సెంటర్లకు వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది. 

దీనికి తోడు, మద్యం కొనుగోళ్లలో చిల్లర సమస్య రాకుండా ప్రివిలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీపై రూ. 10 మేర పెంచేలా ప్రభుత్వం సవరణ చేసింది. అంటే... మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధర రూ. 150.50గా ఉంటే... దాన్ని రూ. 160 చేసేలా అదనపు ప్రివిలేజ్ ఫీజు ఉంటుంది. ఎమ్మార్పీ ధరల్లో చిల్లర సర్దుబాటు చేస్తూ, రౌండ్ ఫిగర్ ఉండేలా ఈ సవరణ చేశారు.
AP Liquor
Cess

More Telugu News