Jagga Reddy: దసరా రోజు పాలపిట్టను బంధించిన జగ్గారెడ్డి... వన్య ప్రాణి సంరక్షకుల ఫిర్యాదు

Jagga Reddy sparks row with ill treatment of Telangana State bird during Dasara
  • పంజరంలో పాలపిట్టలను ఉంచి వేదికపై ప్రదర్శించిన జగ్గారెడ్డి
  • పాలపిట్టలను చేతుల్లో పట్టుకొని వేదిక మీద నిలుచున్న కుటుంబ సభ్యులు
  • వైల్ట్ లైఫ్ చీఫ్ వార్డెన్‌కు ఫిర్యాదు చేసిన వన్య ప్రాణి సంరక్షకులు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి దసరా పండుగ రోజున రాష్ట్ర పక్షి పాలపిట్టను బంధించారు. దీంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. సంగారెడ్డి పట్టణంలోని నిర్వహించిన దసరా వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ పంజరంలో పాలపిట్టలను బంధించి తెచ్చి... ప్రజలకు బహిరంగంగా చూపించారు.

పాలపిట్టను బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని గుర్తించిన వన్య ప్రాణి సంరక్షకులు... తెలంగాణ వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ సుభద్రాదేవికి  ఫిర్యాదు చేశారు. పండుగ రోజున పాలపిట్టలను బంధించవద్దని అటవీ శాఖ అధికారులు చెప్పినప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

ఈ దసరా వేడుకల్లో జ‌గ్గారెడ్డితో పాటు ఆయ‌న భార్య‌, టీజీఐఐసీ చైర్మ‌న్ నిర్మ‌లా రెడ్డి, కూతురు జ‌యారెడ్డి, కుమారుడు భ‌ర‌త్ సాయి రెడ్డి పాల్గొన్నారు. వీళ్లు కూడా పాల‌పిట్ట‌ల‌ను త‌మ చేతుల్లో ప‌ట్టుకుని వేదిక‌పై నిల్చున్నారు. వ‌న్య‌ప్రాణుల‌ను బంధించ‌డం వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టం 1972 ప్ర‌కారం నేరంగా చట్టం చెబుతోంది.
Jagga Reddy
Telangana
Dasara
Congress

More Telugu News